చిరంజీవికి ప్రమోషన్ రావడం వల్లే రాజ్యసభకు : మంత్రి సీఆర్

మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (18:27 IST)
File
FILE
తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న చిరంజీవికి ప్రమోషన్ వచ్చి రాజ్యసభకు వెళ్ళారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి సి.ఆర్.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం రాయచోటిలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రగిరి స్థానంలో ఓడిపోయి కుప్పం పారిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తమ నేత చిరంజీవి గురించే మాట్లాడే హక్కు ఏమాత్రం లేదన్నారు.

చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమోషన్ మీద రాజ్యసభకు వెళ్లారే కాని బాబులా పారిపోలేదన్నారు. వరంగల్‌లో బీసీ మహాగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. ఆ సభా ముఖంగా వంద మంది బీసీలకు టిక్కెట్లు ఇస్తామని వాగ్ధానం చేశారన్నారు.

కానీ, ఆయన వాగ్ధానం ఆ ప్రకటనకే పరిమితమైందన్నారు. అంతేకాకుండా, నాడు ప్రజారాజ్యాన్ని వలసల పార్టీ అన్న చంద్రబాబు నేడు పీఆర్పీ శ్రేణులను టీడీపీలో చేరమనడం విడ్డూరంగా ఉందని, ఇప్పుడు టీడీపీని కూడా వలసల పార్టీ అని ఎందుకు అనకూడదని మంత్రి రామచంద్రయ్య ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి