జగన్ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు: వయలార్

ఆదివారం, 10 జూన్ 2012 (15:20 IST)
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కేసుపై మాట్లాడబోనని కేంద్ర మంత్రి వయలార్ రవి అన్నారు. జగన్ కేసును సీబీఐ చూసుకుంటుందని వయలార్ చెప్పారు. జగన్ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని వయలార్ వెల్లడించారు. రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మెజారిటీతో గెలుస్తామని వయలార్ ధీమా వ్యక్తం చేశారు.

తాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వయలార్ రవి స్పష్టం చేశారు. దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌రై అన్నా బృందం బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో రాజకీయ యుద్ధ క్రీడ నడుస్తోందని వయలార్ రవి చెప్పారు. అన్నా హజారే బృందం సభ్యులు జాతీయ రాజకీయాలను అస్థిరపరచాలని చూస్తున్నారని వయలార్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నికల కోసం ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన కేంద్ర మంత్రి వయలార్ రవి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న వాయలార్ రవితో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్య నారాయణ, షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఎన్నికలపై సమీక్ష జరుపుతారు.

వెబ్దునియా పై చదవండి