జగన్ : కోర్టులో మెమో.. దాన్నే తుది చార్జీషీట్‌గా పరిగణించాలి!

FILE
దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంపై తన కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కోర్టులో మెమో దాఖలు చేశారు. దాల్మియా సిమెంట్స్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్‌నే తుది చార్జీషీట్‌గా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సిబిఐ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

తన ఆస్తుల కేసులో ఒకే చార్జిషీట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయితే సిబిఐ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వేర్వేరు చార్జిషీట్లను దాఖలు చేస్తోందని జగన్ మెమోలో వివరించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ కోర్టును కోరారు. అంశాలవారీగా చార్జిషీట్లు దాఖలు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని జగన్ ఎత్తిచూపారు.

వెబ్దునియా పై చదవండి