జగన్ దీక్ష విరమించాలి... లేదంటే కోమాలోకి..? : వైద్యులు

FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న జగన్ దీక్ష విరమించాలని వైద్యులు కోరారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు జగన్కు వైద్య పరీక్షలు చేశారు.

నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి వంద గంటలు దాటిపోయిందని ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బీటింగ్ 72గా ఉందని, సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారు.

జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి