జనసంద్రంగా మారిన రాజమండ్రి లాలాచెరువు

మంగళవారం, 10 మార్చి 2009 (20:03 IST)
FileFILE
ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సామాజిక న్యాయ శంఖారావం బహిరంగ సభకు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఫలితంగా రాజమహేంద్రవరంలోని లాలా చెరువు మైదానం జన సంద్రాన్ని తలపించింది. ఉత్తుంగ తరంగంలా తరలి వచ్చిన కార్యకర్తలు, చిరంజీవి అభిమానులతో జన సునామీగా మారింది.

లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను ఆపడం భద్రతా సిబ్బంది, పోలీసుల తరం కాలేదు. తిరుపతి అవిలాల చెరువులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ మాదిరిగానే రాజమండ్రి లాలాచెరువు సభలోను అభిమానులు బారికేడ్లు విరిగి పోయారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో తీవ్రంగా తొక్కిసలాట జరిగింది. పలువురు అభిమానులు, కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు.

ముందుకు తోసుకురావద్దని నిర్వాహకులు ఎంతగా వేడుకున్నా వారి వేడుకోలు అడవిగాచిన వెన్నెల మాదిరిగానే అయింది. చిరంజీవిని అతి సమీపం నుంచి చూడాలని, సభా ప్రాంగణంలో వెనుక ఉన్నవారు అంతకంతకూ తోసుకురావడంతో నిలువరించలేక ముందున్నవారు మరింత ముందుకు చొచ్చుకువచ్చారు. కాగా ఈ సభకు చిరంజీవి సాయంత్రం 6.35 నిమిషాలకు వేదికపైకి వచ్చారు.

వెబ్దునియా పై చదవండి