జాడలేని రాజన్న: రాష్ట్రమంతటా... శోక సముద్రం

గురువారం, 3 సెప్టెంబరు 2009 (06:07 IST)
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వార్తలు వెలువడిన నుంచి రాష్ట్రమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ భారతదేశంలోనే కాకుండా.. దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న డాక్టర్ యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. బుధవారం ఉదయం 9.35 నిమిషాలకు ఆయన జాడ తెలియకుండా పోయారు. అప్పటి నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు ఏ చిన్న సమచారం లభించలేదు. ఫలితంగా.. రాష్ట్ర మంతటా విషాద ఛాయలు అలముకున్నాయి.

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌కు జరిగిన ప్రమాద తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం బుధవారం మధ్యాహ్నం వరకు పసిగట్ట లేక పోయింది. ఫలితంగా.. ముఖ్యమంత్రి మిస్సింగ్ వ్యవహారంలో కళ్ళు తెరిచి చూసే సరికి అంధకారం అలుముకుపోయింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి సురక్షితంగానే ఉన్నారంటూ ప్రభుత్వం ప్రచారం చేసిన వదంతలును ప్రజలు సైతం గుడ్డిగా నమ్మేశారు.

తీరా సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఆర్థిక మంత్రి రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి‌, డీజీపీ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి తెలియలేదని అధికారిక ప్రకటన చేసేంత వరకు పరిస్థితి ఇంత విషమంగా ఉందని ఏ ఒక్కరూ ఊహించలేదు.

కాబట్టి ప్రజలు ముఖ్యమంత్రి జాడ కోసం అన్వేషించాలంటూ రోశయ్య చేసిన విజ్ఞప్తితో రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి నుంచే రాష్ట్ర యంత్రాంగం పోలీసు బలగాలను అప్రమత్తం చేసింది. కేంద్ర కూడా మేల్కొని సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. ఎన్ని రకాల చర్యలు చేపట్టినా.. రాజన్న జాడ అణు మాత్రం కనిపించక పోవడంతో రాష్ట్రంలోనే కాకుండా, తెలుగు ప్రజలు నివశిస్తున్న పొరుగు రాష్ట్రాల ప్రాంతాల్లో సైతం విషద ఛాయలు అలముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి