తీవ్రవాదం అంతర్జాతీయ సమాజానికి సవాల్: పాటిల్

మంగళవారం, 1 డిశెంబరు 2009 (16:40 IST)
అంతర్జాతీయ సమాజానికి తీవ్రవాదం పెను సవాల్‌గా మారిందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జరుగుతున్న ప్రపంచ మహాసభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. మెరుగైన, శాంతియుత ప్రంచాన్ని నిర్మించేందుకు బాధ్యతాయుతమైన జర్నిలిస్టులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రస్తుతం అంతర్జాతీయ తీవ్రవాదానికి తీవ్రవాదంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ పెను సవాల్‌గా మారిందన్నారు. ముఖ్యంగా, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తే ప్రశాంత జీవనం సాధ్యమవుతుందన్నారు. అలాగే, మనిషి మనుగడకు పర్యావరణ పరిరక్షణ కూడా అతి ముఖ్యమన్నారు.

ఈ రెండు అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆమె సూచించారు. పర్యావరణ పరిరక్షణ వల్ల ఎదురయ్యే భవిష్యత్ ఇబ్బందులను ప్రపంచ దేశాలు గుర్తెరిగాయన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పాకిస్థాన్ జర్నలిస్టు, డైలీ టైమ్స్ సంపాదకుడు సజామ్ సేథీకి ప్రపంచ ఎడిటర్స్ గిల్డ్ అందించే "గోల్డెన్ పెన్ ఫ్రీడం అవార్డు"ను ప్రతిభా పాటిల్ అందజేశారు. హైటెక్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహాసభల్లో 87 దేశాలకు చెందిన 900 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి