తెలంగాణాకు హామీ ఇస్తేనే ఓటు: నరేంద్ర

గురువారం, 10 జులై 2008 (18:04 IST)
ప్రత్యేక తెలంగాణా అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే యూపీఏకు సానుకూలంగా ఓటు వేస్తానని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు ఎ.నరేంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...యూపీఏ ప్రభుత్వం తెలంగాణా అంశంపై సానుకూలంగానే స్పందిస్తేనే తాము మద్దతు ఇస్తామన్నారు.

యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఓటువేయమని కేంద్రమంత్రి ఎన్.జైపాల్ రెడ్డి తనకు ఫోన్ ద్వారా కోరినట్టు చెప్పారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు కోరినట్లుగా జైపాల్ రెడ్డి పేర్కొన్నారని ఆయన తెలిపారు.

జాతి ప్రయోజనాలతో సహా తెలంగాణా ప్రజల ప్రయోజనం కూడా ముఖ్యమని జైపాల్ రెడ్డికి చెప్పామని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం నుంచి వామపక్షాలు వైదొలగడంతో కేంద్ర ప్రభుత్వం తమకు ఆనుకూలంగానే స్పందిస్తుందని ఆయన వెల్లడించారు. తెలంగాణా అంశంపై వామపక్షాలు వ్వతిరేకిస్తున్నాయని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవన్నది గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి