తెలంగాణ అంశం చర్చించక పోవడం విచారకరం : హరీష్ రావు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2012 (14:04 IST)
File
FILE
ఖమ్మ జిల్లాలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ అంశాన్ని మాటమాత్రానికైనా చర్చించక పోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే టి.హరీష్ రావు అన్నారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... సీపీఎం రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ అంశం చర్చించక పోవడం, ప్రస్తామించక పోవడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే.. సీపీఎం మాత్రం తన వైఖరిని మార్చుకోక పోవడం విచారకరమన్నారు. ఇలాంటి పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు.

అంతేకాకుండా, గత 50 సంవత్సరాల సీపీఎం పార్టీ చరిత్రలో ఒక్క తెలంగాణ నాయకుడు కార్యదర్శి కాగల అర్హతలు లేవా అని ప్రశ్నించారు. ఇదేవిధంగా సీపీఎం దోరణి ఉంటే తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకపోతుందన్నారు. రాష్ట్రంలో మూడు నిరాహారదీక్షలు ఆరు ఆందోళనలు కొనసాగుతున్నాయని విమర్శించారు.

అంతకుముందు ఆయన రవాణాశాఖ మంత్రి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. సకలజనుల సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి