తెలంగాణ ఇవ్వాలి .. వివేక్ - సమైక్యాంగా ఉంచాలి .. లగడపాటి

సోమవారం, 10 సెప్టెంబరు 2012 (13:37 IST)
File
FILE
రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీ జి వివేక్ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరారు. మరోవైపు.. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌‌ను సమైక్యాంగానే ఉంచాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గట్టిగా కోరారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనను ఇరు ప్రాంతాల నేతలు కలుసుకుని తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సోమవారం ఎంపీలు వివేక్, లగడపాటితో పాటు.. మరికొంతమంది నేతలు కలుసుకుని తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వివేకా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్‌ మనుగడ సాగించడం కష్టమని చెప్పినట్టు వెల్లడించారు. మరో వైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆజాద్‌ను కోరారు.

వెబ్దునియా పై చదవండి