దిల్‌కుశ్ అతిథి గృహంలో రాజుపై విచారణ

సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజును సీబీఐ విచారించడం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న దిల్‌కుశ్ అతిథి గృహంలో సీబీఐ రాజును సీబీఐ విచారిస్తోంది.

సీబీఐ తన విచారణలో భాగంగా రాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్ఓ శ్రీనివాస్‌తో సహా ఇద్దరు పీడబ్ల్యూసీ ఆడిటర్లను కూడా సీబీఐ విచారిస్తోంది. రాజును సీబీఐకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు సోమవారం అనుమతి ఇవ్వడంతో పోలీసులు మంగళవారం ఉదయం పది గంటలకు చంచల్‌గూడ జైలునుంచి దిల్‌కుశ్ అతిథి గృహానికి తరలించారు.

రాజును అతిథి గృహానికి తరలించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అటుపై ఎస్కార్టు వాహనంలో రాజును అతిథి గృహానికి తరలించారు. రాజుతో సహా ఐదుగురిని సీబీఐ నేటి నుంచి వారం రోజులపాటు విచారించనుంది.

వెబ్దునియా పై చదవండి