దేవినేని ఉమతో టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా బాట

శుక్రవారం, 2 ఆగస్టు 2013 (11:44 IST)
File
FILE
రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాబాట పట్టారు. ఈ రాజీనామాలకు దేవినేని ఉమామహేశ్వర రావు తొలుత శ్రీకారం చుట్టగా, ఆయనను అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వాలు తమ వ్యవహార శైలితో తమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని, ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ మాత్రమే వారు రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజీనామాలకు తొలుత మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా శ్రీకారం చుట్టగా.. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేశారు. మొత్తంమీద గురువారం రాత్రికి 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపించారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం, కృష్ణా జిల్లా), కందికుంట వెంకట ప్రసాద్ (కదిరి, అనంతపురం జిల్లా), అబ్దుల్ ఘనీ (హిందూపురం, అనంతపురం జిల్లా), మల్లెల లింగారెడ్డి (ప్రొద్దుటూరు, కడప జిల్లా), కొమ్మాలపాటి శ్రీధర్ (పెదకూరపాడు, గుంటూరు జిల్లా), బీకే పార్థసారథి (పెనుకొండ, అనంతపురం జిల్లా), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ, అనంతపురం జిల్లా), పరిటాల సునీత (రాప్తాడు, అనంతపురం జిల్లా), పల్లె రఘునాథ రెడ్డి (పుట్టపర్తి, అనంతపురం జిల్లా), తంగిరాల ప్రభాకర్ రావు (నందిగామ, కృష్ణా జిల్లా), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట, గుంటూరు జిల్లా), నక్కా ఆనందబాబు (వేమూరు, గుంటూరు జిల్లా), ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (పొన్నూరు, గుంటూరు జిల్లా), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల, గుంటూరు జిల్లా), ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, మెట్టు గోవిందరెడ్డి, శమంతకమణిలు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి