నందమూరి-నారా విబేధాలపై నోరు విప్పను: జూ.ఎన్టీఆర్

FILE
నందమూరి- నారా చంద్రబాబు నాయుడు విబేధాలపై నోరు విప్పబోనని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు-హరికృష్ణల వివాదాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. హరికృష్ణ-చంద్రబాబుల విబేధాలపై కొడుకుగా నేను కాకుండా, తండ్రిగా మా నాన్నగారు సమాధానమిస్తారని జూనియర్ వెల్లడించారు.

నారా-నందమూరి విబేధాల గురించి వ్యాఖ్యానించబోమని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. నారా-నందమూరిల విబేధాల గురించి వ్యాఖ్యానించేందుకు ఇది సందర్భం కాదు, వేదిక కాదని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

కాగా, అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన, అవినీతి నిర్మూలన కోసం త్వరలో మీ ముందుకు వస్తానని టీడీపీ పొలిట్‌‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం ప్రజలకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కుంట భూమిలేని వారు రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

మైనింగ్ ద్వారా, భూముల ద్వారా రాజకీయాలను అడ్డం పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం, అవినీతి నిర్మూలనకై త్వరలో మీ ముందుకు వస్తానని హరికృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ద్వారా నారా-నందమూరి కుటుంబాల మధ్య విబేధాలు వెలుగులోకి వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి