న్యాయ, ధర్మాలకే తలొగ్గుతా: దేవేందర్

గురువారం, 10 జులై 2008 (18:09 IST)
న్యాయానికి, ధర్మానికి మాత్రమే తల వంచుతానని దేవేంద్ర గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ భీష్ముడుని కాదల్చుకోలేదని, తమకు రాజధర్మం కన్నా ధర్మపక్షమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే తాము తెలుగుదేశం పార్టీనుంచి బయటకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన తెలంగాణా విద్యార్థి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఏవ్వరూ అడ్డుకోలేరన్నారు.

తెలంగాణా ప్రజలకు గౌరవభావం ఉందని, ఎవరికి తలవంచనవసరం లేదన్నారు. చంద్రబాబు తెదేపాని రెక్కలులేని పక్షిలామారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను బానిసలుగా చేసుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణా వాదులందరూ ఆధినేత వైఎస్ఆర్‌కు బయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాను అధికార ప్రభుత్వం దోపిడి రాజ్యంగా మారుస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో కోట్లు గుమ్మరించి ఓట్లు సంపాదించుకుని చివరకు అభివృద్ధి గెలిచిందని ప్రచారం చేసుకుంటోందన్నారు. చేవెళ్ల- ప్రాణహిత నిర్మించకుండా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌పై వైఎస్ఆర్ ఆసక్తి చూపడం స్వార్థ ప్రయోజనాల కోసమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి