పదో తరగతిలో గ్రేడింగ్ విధానం: వరప్రసాద్

పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాణిక్ వరప్రసాద్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని వరప్రసాద్ ప్రకటించారు.

ఈ మేరకు మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడారు. ఈ అంశంపై ఈ నెల 8 నుంచి అన్ని రాష్ట్రాల విద్యా సంఘాల ప్రతినిధులతో కేంద్ర సమీక్ష నిర్వహించనుందని మంత్రి తెలిపారు.

డీఎస్సీ మెరిట్ లిస్టును మరో 15 రోజుల్లో ప్రకటిస్తామని, బదిలీ ప్రక్రియ అనంతరమే నియామకాలు ఉంటాయని వరప్రసాద్ పేర్కొన్నారు. సక్సెస్ స్కూళ్ల పటిష్టతకు రాష్ట్రీయ మాధవిక మిషన్‌కు శ్రీకారం చుట్టామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి