ప్రాచీన హోదా కోసం కృషి : పురంధరేశ్వరి

మంగళవారం, 5 ఆగస్టు 2008 (17:20 IST)
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు సమైక్యంగా పోరాడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన తెలుగు భాషా చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గంగానది ప్రవాహం లాంటి తెలుగు భాష పిల్ల కాలువల్లా విడిపోవటం ఆందోళనకరమని ఆమె చెప్పారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని పురంధరేశ్వరి నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ నెల 8వ తేదీన కేంద్ర భాషా సంఘం సమావేశమవుతుందని, అందులో సభ్యులైన ధరం సింగ్, అంబికాసోని, వీరప్పమొయిలీ ఇందుకు సంబందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని పురంధరేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి