ప్రారంభమైన వైఎస్ఆర్ అభయ హస్తం పథకం

రాష్ట్రంలో నవంబర్ ఒకటవ తేదీన వైఎస్ఆర్ అభయ హస్తం పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో లాంఛనంగా ప్రారంభించారు. తొలుత రోశయ్య డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైఎస్ఆర్ పథకాలను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. అభయహస్తం పథకాన్ని రూపకల్పన చేసిన వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం తనను కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ, వృద్ధాప్య పింఛన్ తదితర పథకాలు లక్షలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రోశయ్య అన్నారు.

వెబ్దునియా పై చదవండి