ప్రేమికుల రోజు : ప్రేమ జంటలకు పెళ్ళిళ్లు చేయం : భజరంగ్ దళ్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2014 (15:38 IST)
File
FILE
ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే ప్రేమికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఆ రోజున ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన, శివసేన వంటి కార్యకర్తల కంట పడకూడదని తమ ఇష్టదైవాలకు మొక్కుకుంటారు. ఎందుకంటే.. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీన పార్కుల్లో కనిపించే ప్రేమ జంటలకు ఈ సంస్థలు బలవంతపు పెళ్ళిళ్లు చేస్తుంటాయి.

అయితే, ఈ యేడాది ప్రేమికుల రోజున మాత్రం ఆ పని చేయబోమని చెపుతున్నాయి. ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన భజరంగ్ దళ్.. పబ్‌లు, హోటళ్లు వాలెంటైన్స్ డే సెలెబ్రేషన్స్ చేయరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సహకరించాల్సిందిగా సిటీ పోలీస్ కమిషనర్‌ను కోరతామని తెలిపింది.

అలాగే, వాలెంటైన్స్ డే నాడు వివాహాలు చేయడం తమ ఉద్దేశం కాదని... ఇటువంటివి జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చాటిచెప్పడమే తమ లక్ష్యమని చెప్పింది. ప్రేమికుల దినోత్సవం నాడు ఏ జంట అయినా దొరికితే... వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తామని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి