బండలావున్నావంటూ వేధింపులు.. జైలుపాలైన వరుడు

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (11:17 IST)
File
FILE
నిశ్చితార్థానికి ముందు ఒకటికి రెండుసార్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఇద్దరు మనస్సుల కలిశాయి. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు ఇష్టపడి నిశ్చితార్థం చేశారు. పెళ్లి సమయానికి రూ.2 లక్షల కట్నంతో పాటు.. బంగారు ఆభరణాలు ఇచ్చేలా కట్నకానుకలు ఇచ్చేలా మాట్లాడుతున్నారు. వచ్చే నెల 12వ తేదీ వివాహం జరగాల్సివుంది.

ఇంతలో అమ్మాయిలో వరుడుతో పాటు.. వరుని కుటుంబ సభ్యులకు ఏమి లోపం కనిపించిందో ఏమోకానీ.. నిశ్చితార్థం చేసుకున్న యువతి బండలా.. లావుగా ఉందంటూ మెలిక పెట్టారు. అనుకున్న ముహుర్తానికి పెళ్లి జరగాలంటే మరో రూ.3 లక్షలు కట్నం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు.

దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఏం చేయాలో దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించి వరుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. అదనపు వరకట్నం కావాలని వేధించిన పాపానికి వరుడు తల్లి, సోదరి, పినతల్లిలను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సంఘటన విజయవాడలోని మాచవరంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన వధువు లావణ్య లక్ష్మికి హైదరాబాద్‌, కూకట్‌పల్లికి చెందిన పాలెం విక్రమ్ నాయుడితో గత ఫిబ్రవరి 8న నిశ్చితార్థం జరగింది. నెల రోజులు తిరగక ముందే అదనపు కట్నం కోసం వేధించడంతో జైలు పాలయ్యారు.

వెబ్దునియా పై చదవండి