భాగ్యనగరిలో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి: సుభాషణ్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం మాజీ ఛైర్మన్, మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బి.సుభాషణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు దక్షిణాది రాష్ట్ర రాజధాని భాగ్యనగరిలో ఈ బెంచ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

దక్షిణ భారతంలో సుప్రీం కోర్టు బెంచ్ అనే అంశంపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం పొందాలంటే సామాన్యులపై మోయలేని ఆర్థిక భారం పడుతోందన్నారు.

ఎందుకంటే రాజధానికి వెళ్లాలంటే అటు డబ్బుతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. అదే దక్షిణాది రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలకు న్యాయపరంగా ఉపశమనం కలుగుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి