మరికాసేపట్లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్.... వెబ్‌దునియాలో చూడొచ్చు

శుక్రవారం, 17 మే 2013 (10:48 IST)
FILE
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగిన పదవతరగతి పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఈ రోజు ఉదయం విడుదల 11 గంటలకు గ్రేడ్ల వారీగా విడుదల చేయనున్నామని మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు.

ఫలితాలను ఇంటర్నెట్ ద్వారా.. ఫోన్‌ ద్వారా... SMS ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థి జీవితంలో తొలిమెట్టు పదో తరగతే అంటారు. ఫలితాల కోసం ప్రతీఒక్క విద్యార్థీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలను మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్‌తో పాటూ రీ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పించనున్నారని ఆయన తెలిపారు. ఈ ఫలితాలను telugu.webdunia.comలో కూడా చూడవచ్చు.

వెబ్దునియా పై చదవండి