మేరిమాత ఉత్సవాలు ప్రారంభం

శనివారం, 9 ఫిబ్రవరి 2008 (14:23 IST)
WD
దక్షిణాదిన అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలకు ముస్తాబయింది. నేటి నుంచి మరియమ్మ సంబరాలు గుణదల కొండపై వైభవంగా సాగుతున్నాయి. తమ కష్టాల్ని తీర్చాలని ఏసయ్యకు చెప్పాలని భక్తులు ఆయన తల్లి మరియమ్మను వేడుకోవటం ఇక్కడి విశేషం. ఏటా ఫిబ్రవరి 9,10,11 తేదీలలో గుణదల పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతాయి.

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి క్రిస్టియన్లు ఇక్కడికి వస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మరియమ్మ చెంతకు కొవ్వొత్తులు పట్టుకుని వస్తున్నారు. బాల ఏసుకు తమ భాధలు విన్నవించి, పాపపరిహారం చేయాలని వేడుకుంటున్నారు. వేలాదిగా వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గుణదల చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి