రాజకీయాల్లో పెను మార్పులు :నారాయణ

గురువారం, 10 జులై 2008 (18:08 IST)
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంతరించుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లోని స్థానిక సీపీఐ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తలక్రిందులుగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా, మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రత్యమ్నాయ పార్టీ ఆగస్టుకల్లా ఓ కొలిక్కి వస్తుందని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం తాము కేంద్ర ప్రభుత్వంతో మద్దతును ఉపసంహరించామని ఆయన తెలిపారు.

అణు ఒప్పందంపై ప్రజలలో పూర్తి అవగాహన తేవడానికి జూలై 18 నుంచి సదస్సులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కేంద్రస్థాయి యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని నారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరకొండలో సీపీఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి