రాజన్న అస్తమయం: 300 దాటిన ప్రాణత్యాగాలు

శనివారం, 5 సెప్టెంబరు 2009 (11:02 IST)
ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మణ వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమయాత్రను, అంత్యక్రియలను టెలివిజన్లలో చూస్తూ తల్లడిల్లిన ఆంధ్రావనిలో శుక్రవారం ఒక్కరోజులోనే 227 మంది మృతి చెందగా, శనివారం ఉదయానికి ఈ సంఖ్య 300కు దాటింది.

వైఎస్ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేక మనోవేదనను లోనై గుండె ఆగి మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. వీరిలో నిండు గర్భిణి మొదలుకుని 80యేళ్ళ వృద్ధుని వరకు ఉన్నారు. మరికొందరు తమ ఇళ్లలో ఉరి వేసుకోగా, మరికొందరు బహుళ అంతస్తులపై, జలాశయాల్లో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

వైఎస్ మరణించారని అధికారికంగా వార్త వెలువడిన రోజే 62 మంది మృతి చెందారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య మూడు వందలకుపైగా దాటినట్టు రాష్ట్ర వర్గాల సమాచారం. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో వైఎస్ అభిమానులు తమ ప్రియతమ నేతతో పాటు.. తిరిగిరాని లోకాలకు చేరుకోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి