రాష్ట్రంలో భారీ వరదలతో 64మంది మృతి: ధర్మాన

FILE
రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలతో ఇప్పటివరకు 64మంది మృతులను గుర్తించినట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ప్రకటించారు.

ఇందులో భాగంగా.. కర్నూలు జిల్లాలో 39మంది, మహబూబ్‌నగర్‌లో 20 మంది, నల్గొండలో ముగ్గురు, గుంటూరు, కృష్ణాజిల్లాలలో ఒకరి చొప్పున మరణించినట్లు ఆయన తెలిపారు.

మంగళవారం సచివాలయంలో ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. 87 మండలాల్లోని 565 గ్రామాలు వరద బారిన పడ్డాయని, 16, 20, 398 మంది పరోక్షంగా వరద వల్ల ప్రభావితమయ్యారని చెప్పారు.

ఇంకా ఈ భారీ వరదలతో 15వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వచ్చాయని ధర్మాన వెల్లడించారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత రాష్ట్రాల్లో మొత్తం 275 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని, వీటిలో 3,59, 779మంది వరద బాధితులున్నారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి