రాష్ట్రపతితో అన్ని అంశాలు చర్చించా: కేసీఆర్

సోమవారం, 9 నవంబరు 2009 (13:33 IST)
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో అన్ని అంశాలు చర్చించినట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఊపుతో ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఆయన చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్రాల్లోని అగ్రనేతలతో భేటీకి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో సమావేశమ్యారు.

ఈ భేటీ అనంతరం కేసీఆర్ పార్లమెట్ భవనం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో 22 నిమిషాల పాటు మాట్లాడినట్టు చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలపై ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో చర్చ జరపాలని విజ్ఞప్తి చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి