రాష్ట్ర విభజన వేడి మరింత ఎక్కువైంది.. సునామీలా ఉద్యమం!

FILE
రాష్ట్ర విభజన వేడి మరింత ఎక్కువైంది. ఉద్యమం సునామీలా మారింది. అన్నీ వర్గాల ప్రజలే కాదు.. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, విద్యార్థి, కుల, కార్మిక, కర్షక సంఘాలు, ఉద్యోగులు..ఇలా ఎవరికివారు ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు ముందుకొస్తున్నారు.

సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారి ఇళ్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు.

అయితే శుక్రవారం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), బొడ్డేపల్లి సత్యవతి (ఆమదాలవలస), జుత్తు జగన్నాయుకులు (పలాస), కొర్ల భారతి (టెక్కలి), మీసాల నీలకంఠంనాయుడు (ఎచ్చెర్ల), పీరుకట్ల విశ్వప్రసాద్ (ఎమ్మెల్సీ) సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘మేము సైతం!’ అంటూ రాజీనామా చేసారు.

వెబ్దునియా పై చదవండి