రైతన్నలకు కరెంటు కోత ఉండదు: రఘువీర రెడ్డి

గురువారం, 10 జులై 2008 (18:08 IST)
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లోను రైతన్నలకు యాధావిధిగా ఏడుగంటల పాటు సరఫరా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖామంత్రి, నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య, విద్యుత్ శాఖామంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... గత ఏడాది నిబంధనలనే ఈ ఏడాది కూడా మేఘమథనాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జలాశయాల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయిందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదన్నారు. దక్షిణాదిలో వర్షాలు కురవక పోవడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి స్తంభించిపోయాయని ఆయన చెప్పారు. కావలసినంత మేరకు సెంట్రల్ గ్రిడ్ నుంచి విద్యుత్‌ను తీసుకుంటున్నామని విద్యుత్‌ శాఖమంత్రి షబ్బీర్ అలీ ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ కొరత కొద్ది రోజుల్లో చక్కబడుతుందని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి