లగడపాటి రాజగోపాల్ : విభజన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్!

బుధవారం, 7 ఆగస్టు 2013 (14:00 IST)
File
FILE
రాష్ట్ర విభజన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టేనని, అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌ల నుంచి ప్రకటన వచ్చేలా తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు.

ఢిల్లీలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం లగడపాటి, రాష్ట్ర మంత్రులు కొండ్రు మురళి, గంటా శ్రీనివాస రావులు మీడియాతో మాట్లాడుతూ విభజన ప్రక్రియ ముందుగు సాగదని కేంద్రం నుంచి హామీ వచ్చిందన్నారు. ఇదే అంశంపై అధికారిక ప్రకటన రావల్సి ఉందన్నారు.

సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్ర ఉద్యమం రగిలిన నేపథ్యంలో హైకమాండ్ ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ నివేదిక వచ్చేదాకా విభజన ప్రక్రియను కొనసాగించేది లేదనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి