వచ్చే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం: దేవేందర్

త్వరలో జరుగనున్న అసెంబ్లీ, ఎన్నికలు తమకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా యావత్ భారత ముఖచిత్రాన్నే మార్చేస్తాయని ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు టి.దేవేందర్ గౌడ్ ఉద్ఘాటించారు. మన రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే అధికారం అనుభవించాలా అని ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమన్నారు. అలాకాని పక్షంలో రాష్ట్ర రాజకీయాలు వైఎస్, బాబుల మధ్యే తిరుగుతాయని ఆయన హెచ్చరించారు.

వైఎస్, చంద్రబాబు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. అట్టడుగు ప్రజల జీవితాలను మార్చే ప్రయత్నం వారు చేయబోరని గౌడ్ విమర్శించారు. రాజమండ్రి లాలాచెరువులోని స్పిన్నింగ్ మిల్లు మైదానంలో మంగళవారం సాయంత్రం జరుగుతున్న సామాజిక న్యాయ శంఖారావం సభలో దేవేందర్ గౌడ్ ముందుగా ప్రసంగించారు.

అరవై ఏళ్ళ స్వతంత్ర ఫలాలు రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలను నిర్ణాయక శక్తిగా మార్చడం ద్వారా వారికి అందేలా చేయడమే ప్రజారాజ్యం పార్టీ లక్ష్యం అని దేవేందర్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన సభకు హాజరైన వేలాది మంది చిరంజీవి అభిమానులు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి