వరదప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్ళ రద్దు: దమరైల్వే

రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, నల్గొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణించే ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది.

గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా, వరద నీటివలన రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో ఆయా జిల్లాల్లోని పట్టణాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.

ఈ నెల 9వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దమరైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రైల్వేలైన్లు త్వరలోనే పునరుద్ధరిస్తామని, రైల్వేలైన్లను పునరుద్ధరించిన తర్వాతనే రైళ్లను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి