వర్షాభావ పరిస్థితులపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లు రోశయ్య వెల్లడించారు.

మరోవైపు.. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఆయన శనివారం కరువు పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేసం నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. కరువు తీవ్రతను తగ్గించేందుకు అవరసమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి