విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ మొగ్గు!!

శనివారం, 10 డిశెంబరు 2011 (15:06 IST)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. ఇదే అంశంపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌‍కు సోమవారం ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. ఇందులో విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అలాగే, కాంగ్రెస్‌లో చిరంజీవి, ఆయన మద్దతుదారులకు సముచిత స్థానం కలిపించే విషయంలో కొంతసమయం పడుతుందని అధిష్టానం చెబుతున్నట్టు సమాచారం. దీంతో చిరంజీవి, ఆయన మద్దతుదారులు సముచిత స్థానం ఎప్పుడు కలిపిస్తారా... కాంగ్రెస్‌ నేతలు ఈ విధంగానే కాలం వెళ్లదీస్తారా అన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి