వైకుంఠ ఏకాదశి: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు!

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అలాగే భద్రాచలం, సింహాచలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం జరుగనుండటంతో తిరుమలకు ప్రవాహంలో భక్తులు వస్తున్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాట మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మరోవైపు శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం గ్రామోత్సవం, తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి