శ్రీదేవీ, జయప్రదలతో ఇండస్ట్రీలోనే జెలసీ ఫీల్ కాలేదు... జయసుధ!

శనివారం, 9 మార్చి 2013 (22:42 IST)
FILE
బండ చంద్రారెడ్డి దంపతులను చూసి ఈర్ష్యతో ఇదంతా చేస్తున్నానని కొందరు అంటున్నారు. ఒకప్పుడు సినిమా రంగంలో శ్రీదేవి, జయప్రద వంటి హీరోయిన్లు ఉన్నప్పుడే తాను జెలసీగా ఫీల్ కాలేదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అన్నారు.

తనకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదని, బండ చంద్రారెడ్డి దంపతుల వ్యవహారశైలిపై వ్యక్తిగతంగా ఉన్న భేదాభిప్రాయాలే కారణమని జయసుధ వెల్లడించారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను చూస్తూ సహించలేనని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. ఇదే విషయాన్ని కొందరు పార్టీ ముఖ్యులతో చెప్పానని జయసుధ వెల్లడించారు. అయితే ఇదంతా సహజమేనని, చూసీచూడనట్లుండాలంటూ తనకే ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి