సంప్రదింపులు ప్రక్రియ: 12న సీమాంధ్ర నేతలతో ఆజాద్ భేటీ

గురువారం, 8 సెప్టెంబరు 2011 (20:05 IST)
రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ సంప్రదింపులు ప్రక్రియ ప్రారంభంకానుంది. సీమాంధ్ర నేతలతో ఈనెల 12వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ కబురు పంపారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.

దీనిపై సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి కన్వీనర్, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. గతసారి చర్చల కోసం వెళ్లిన 30 మంది నేతలతో వెళ్లి సమైక్యవాదం బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.

ఇదిలావుండగా, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల స్టీరింగ్‌ కమిటీ భేటీ శనివారం భేటీ కానుంది. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోనియా అనారోగ్యం, ఆజాద్‌తో సంప్రదింపుల వల్ల ఉద్యమాన్ని ఉధృతం చేయలేకపోతున్నామని అన్నారు.

విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, అలాగే నేతల ఇళ్లపై దాడులు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. రాజీనామాలు తిరస్కరించే అధికారం స్పీకర్‌కు ఉంటే, వాటిని ఆమోదింపజేసుకునే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని పొన్నం ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి