సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం: త్యాగి

గురువారం, 10 సెప్టెంబరు 2009 (13:52 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగిందని సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జరనల్ డీజీ త్యాగి వెల్లడించారు. హెలికాఫ్టర్ ప్రమాద స్థలాన్ని ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెలికాఫ్టర్ సముద్ర మట్టానికి 355 మీటర్ల ఎత్తులో జరిగినట్టు ఓ నిర్థారణకు వచ్చినట్టు చెప్పారు.

ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి మ్యాచ్‌ను తయారు చేశామన్నారు. కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ డీకోడింగ్ ఢిల్లీలో జరుగుతోందని చెప్పారు. మరో రెండు వారాల్లో ఘటనా స్థలాన్ని సందర్శించి నివేదికను సమర్పిస్తామని త్యాగి చెప్పారు. అంతకుముందు హెలికాఫ్టర్ ప్రమాదంపై త్యాగి నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతున్న విషయం తెల్సిందే.

ఈ బృందం కర్నూలు నుంచి ఆత్మకూరుకు హెలికాఫ్టర్‌లో చేరుకుని, అక్కడ నుంచి ప్రమాదం జరిగిన పావురాలగుట్టకు కాలినడక చేరుకుంది. ప్రమాద స్థలిని అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గంటల తరబడి అక్కడే నివశిస్తూ విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి