సమైక్య ఉద్యమ సత్తా: మంత్రుల రాజీనామా బాట

సమైక్య ఉద్యమ సత్తా మంత్రులను రాజీనామా బాట పట్టించింది. పది రోజుల తర్వాత ప్రజల మనోగతమేమిటో మన ప్రజాప్రతినిధులకు అవగతమైంది. రాజీనామాలు చేయక తప్పదని అర్థమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పరిరక్షణకు జిల్లాలో మహోద్ధృతంగా సాగుతున్న ఉద్యమానికి వెరచి అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దిగివచ్చారు.

తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖలను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి శుక్రవారం సమర్పించారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పలాస ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, బొడ్డేపల్లి సత్యవతి, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులుతోపాటు ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ తమ పదవులకు రాజీనామా చేశారు.

గత పదిరోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నా.. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నా నాన్చుడు ధోరణి అవలంభించిన ఈ నేతలు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి