సామాన్యు భక్తులే మాకు వీఐపీలు: ఛైర్మన్ కనుమూరి

గురువారం, 1 సెప్టెంబరు 2011 (11:32 IST)
శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులే తమకు వీఐపీలు అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొత్త ఛైర్మన్, నర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన తితిదే ఛైర్మన్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులే మాకు వీఐపీలని, వారికే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాను ఉద్యోగులలో ఒక వ్యక్తిగా కలిసి మెలిసి పనిచేస్తానని చెప్పారు. మచ్చలేని వ్యక్తిగా, అందరికీ అప్తుడిగా పేరున్న కనుమూరి మొదటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న విషయం తెల్సిందే.

పార్టీ పట్ల, నాయకత్వం పట్ల ఆయన చూపిన విధేయతకు గాను బాపిరాజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదవిని కట్టబెట్టింది. అణు ఒప్పందంపై జరిగిన ఓటింగ్ సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినందుకు గాను అప్పటి తెలుగుదేశం ఎంపీ ఆదికేశవులు నాయుడుకు కాంగ్రెస్ తితిదే ఛైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం తెల్సిందే. ఇపుడు అలాంటి అడ్డదారులు తొక్కకుండా మచ్చలేని నేతను ఎంపిక చేసింది.

వెబ్దునియా పై చదవండి