హస్తినలో విజయశాంతి : సోనియాతో భేటీ.. కాంగ్రెస్ తీర్థం!

గురువారం, 8 ఆగస్టు 2013 (12:56 IST)
File
FILE
టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, మెదక్‌ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే అంశంపై చర్చలు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపేందుకు ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఇందులోభాగంగా గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు.

పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఒక్క కేసీఆర్ వల్ల వచ్చింది కాదనీ, ఎందరో అమరవీరులు, నేతల కృషి ఫలితంగా వచ్చిందన్నారు. పైపెచ్చు.. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని విజయశాంతి జోస్యం చెప్పారు.

మరోవైపు, తెరాస పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ మంత్రులు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, జి.విజయరామారావు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో ఇప్పటికే పలుమార్లు సమావేశమైన వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి