హైకోర్టు ఆదేశంతో మున్సిపల్ పోల్ రిజల్ట్స్ : రమాకాంత్

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (17:40 IST)
FILE
హైకోర్టు ఆదేశం మేరకు ఈనెల 9వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 9న చేపట్టి అదే రోజున ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 9నే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే.

దీనిపై రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. 9వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సవరణ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు.

8వ తేదీ ఉదయం వరకు కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపుకు సిద్ధమవుతామని రమాకాంత్ రెడ్డి వివరించారు. పురపాలక ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైందని చప్పారు. ఒకవేళ పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లి వాయిదాపడితే కోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి