10 రోజుల్లో తిరుపతి అభ్యర్థి ప్రకటన: పీసీసీ చీఫ్ బొత్స

మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (16:57 IST)
File
FILE
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును మరో పది రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం కడపలో మాట్లాడుతూ... ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ కావాలని కోరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అందువల్లే తుది అభ్యర్థిని ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

వచ్చే ఉప ఎన్నికల్లో అభివృద్ధే తమ ప్రధాన ప్రచార ఎజెండాగా ప్రజల ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బాబు మాటలను ప్రజలు విశ్వసించటం లేదని బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు.

కాగా, ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి.. కాంగ్రెస్‌లో విలీనమై.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. దీంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

వెబ్దునియా పై చదవండి