15 మంది మంత్రుల రాజీనామాలపై ముఖ్యమంత్రి మౌనం!

బుధవారం, 31 జులై 2013 (12:40 IST)
FILE
రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం రావడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది మంత్రులు రాజీనామాకు సిద్ధమయ్యారు. గతంలో రాజీనామా చేసిన లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతికి సమర్పించామని, ఇపుడు కూడా ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విషయంపై నిన్న రాత్రి వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి మాట్లాడినట్లు సమాచారం.

రాజీనామాల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొంత మౌనం వహిస్తున్నట్లు తెలుస్తుంది. రాజీనామాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే కొంత కాలం ఆగి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే మంత్రుల రాజీనామాలను తానూ వ్యతిరేకించడం లేదు, అలాగని ఆమోదించడం లేదని ఆయన అభిప్రాయం కావచ్చును.

వెబ్దునియా పై చదవండి