కళ్లు తెరిచిన ఆర్టీఏ అధికారులు: రైడ్.. బస్సుల సీజ్!

శనివారం, 26 జులై 2014 (15:09 IST)
మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 
 
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఫిట్‌నెస్ లేని 17 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బస్సులను నడిపిన వారిపై 102 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసినట్లు ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు. 
 
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన తాము నిర్వహించిన తనిఖీల్లో వందలాది కేసులు నమోదు చేశామని ఆర్టీఏ అధికారులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి