2014 ఎన్నికల్లో అగ్నిగుండంలో దూకొద్దు : చంద్రబాబు

మంగళవారం, 6 నవంబరు 2012 (18:01 IST)
File
FILE
2014లో జరుగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఇతర పార్టీలకు ఓట్లు వేసి అగ్నిగుండంలో దూకొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నీలం తుఫాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇపుడు హైదరాబాద్ నగరం పూర్తిగా నేరగాళ్ళ కేంద్రంగా మారిందన్నారు.

అలాగే, 2004 ఎన్నికల్లో తను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 2009లో ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీకి ఓటు వేసి సుడిగుండంలో దూకారన్నారు. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అగ్నిగుండంలో దూకొద్దని ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల కలిగిన ముప్పును మహా విపత్తుగా ప్రకటించాలని ఆయన కోరారు. 2014 ఎన్నికల్లో అగ్నిగుండలో దూకొద్దు : చంద్రబాబు
నీలం తుఫాను, చంద్రబాబు, టీడీపీ, కాంగ్రెస్, జగన్ పార్టీ
Nilam Cyclone, Chandrababu, TDP, Congress, Jagan Party
2014లో జరుగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఇతర పార్టీలకు ఓట్లు వేసి అగ్నిగుండంలో దూకొద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నీలం తుఫాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇపుడు హైదరాబాద్ నగరం పూర్తిగా నేరగాళ్ళ కేంద్రంగా మారిందన్నారు.

అలాగే, 2004 ఎన్నికల్లో తను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 2009లో ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీకి ఓటు వేసి సుడిగుండంలో దూకారన్నారు. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అగ్నిగుండంలో దూకొద్దని ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల కలిగిన ముప్పును మహా విపత్తుగా ప్రకటించాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి