శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్‌గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి.
తాజాగా గ్రేహౌండ్స్ దళాలకు అత్యాధునిక ఆయుధాలను ఇవ్వాలని ఏపీ సర్కార్ నిశ్చయించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మావోయిస్టులతో పాటు ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా ఏపీలో మళ్లీ జోరందుకోనున్నాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో... ప్రభుత్వం వీరికి ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆయుధాలు అందివ్వాలని నిశ్చయించింది.
ప్రస్తుతం మావోయిస్టులు, ఉగ్రవాదులు కూడా ఏకే-47, ఎస్ఎల్ఆర్ లాంటి అత్యాధునిక గన్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో... వాటికి మించిన గన్స్‌ను గ్రేహౌండ్స్ దళాలకు అందివ్యాలని ఏపీ పోలీస్ శాఖ నిర్ణయించుకుంది.