అప్పు ఇచ్చాడు, అర్థరాత్రి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ ఇంటి తలుపులు బాదాడు, ఆ తరువాత?

శుక్రవారం, 8 మే 2020 (17:23 IST)
క్రిష్ణాజిల్లా ఉయ్యూరు ప్రాంతం. 40 యేళ్ళ మహిళ తన 22యేళ్ళ కూతురితో కలిసి ఉంటోంది. భర్త అనారోగ్యంతో రెండేళ్ళ క్రితం చనిపోయాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో ఇన్నిరోజులు నడుపుకుంటూ వచ్చింది. అయితే కుమార్తె చదువులకు అవసరమైన డబ్బులు గత సంవత్సరం వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకుంది. 
 
సుమారుగా 2 లక్షల రూపాయల వరకు తీసుకుంది. ఎలాంటి ఆస్తులు వడ్డీ వ్యాపారికి తనఖా పెట్టలేదు. వడ్డీ మాత్రం గత ఆరునెలల నుంచి కడుతూ వస్తోంది. అయితే ఈ మధ్య వడ్డీ కట్టడానికి డబ్బులు కూడా లేవు. ఆమె నడుపుతున్న టీ దుకాణం కూడా పూర్తిగా లాక్ డౌన్ వల్ల మూసివేయడం.. అంతకుముందు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనడంతో డబ్బులు కట్టలేకపోయింది.
 
దీంతో వడ్డీ వ్యాపారి ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టడం.. డబ్బులు అడగడం.. ఇదే పనిగా పెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి బాధ భరించలేక ఇంట్లో ఉన్న కుమార్తెను తన స్నేహితురాలి ఇంటికి పంపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వడ్డీ వ్యాపారి అధికార పార్టీకి చెందిన నాయకుడి తమ్ముడి కావడంతో పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు