తమ్ముడితో గొడవ వద్దన్న పాపానికి పదేళ్ల బాలుడు ఏం చేశాడంటే?

బుధవారం, 29 నవంబరు 2023 (22:44 IST)
నిరాశ, నిస్పృహలు జీవితాన్ని తారుమారు చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకు బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది వయోబేధం లేకుండా జరుగుతోంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.
 
తాజాగా తమ్ముడితో గొడవ పడవద్దని మందలించిన కారణంగా పదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపేటలో చోటుచేసుకుంది. 
 
గాజులపేటకు చెందిన ఐదో తరగతి విద్యార్థి సిద్ధార్థ స్కూల్ నుంచి రాగానే తన తమ్ముడితో మోక్షజ్ఞతో గొడవ పడుతూ ఉండగా తల్లి సిద్ధార్థ్ ను మందలించింది. 
 
దీనితో మనస్థాపానికి గురైన సిద్ధార్థ్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మందలించిన పాపానికి కుమారుడు దూరమైన వేదనను ఆ తల్లి తట్టుకోలేక రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు