శ్రీకాకుళం జిల్లా కోటప్ప మండలం కొత్తకోటకు చెందిన రూప, శ్రీనులకు 17 యేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరూ మొదట్లో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో శ్రీనుతో విభేధించింది రూప. ఇద్దరూ కలిసే విడాకులకు అప్లై చేసుకున్నారు. విడిపోయారు. ఆ తరువాత కొన్నినెలల గ్యాప్లో వారు వేరే వివాహం చేసేసుకున్నారు.
నిన్న ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళి అధికారులో గొడవపెట్టుకున్నాడు శ్రీను. తాను బతికే ఉన్నానని.. అయితే తాను చనిపోయానంటూ మొదటి భార్య ధరఖాస్తు చేస్తే ఎలా ఇన్ని సంవత్సరాలుగా వితంతు పెన్షన్ ఇస్తున్నారంటూ ప్రశ్నించాడు. రెవిన్యూ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయాడు శ్రీను. దీనిపై ఎమ్మార్వో అధికారులు విచారణ ప్రారంభించారు.