ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతోపాటు... అధికారం కోల్పోయిన పార్టీని మన ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారని, ఒక రోజున కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్ధలవుతుందని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చెప్పుకొచ్చారు.
అలాగే, 'జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తొలిసారి మాట్లాడుతున్నాను. ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ వంటివారు ఉన్నారు. వారు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. అందుకే క్లుప్తంగా మాట్లాడుతానని చెప్పారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నవారిని తన్నడం కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భయపడకండి.. ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు అని జోస్యం చెప్పారు.